భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్‌గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…
భూమిపై మనుషుల మనుగడ ఎంతకాలం పాటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. భూకంపాలు, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు, గ్లోబల్ వార్మింగ్ ఇలా అన్ని మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. మూకుమ్మడి దాడుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత దశాబ్దకాలంగా ప్రపంచంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దృవప్రాంతాల్లోని మంచు కరిగిపోతున్నది. అనేక దేశాలు ఆదిపత్యం కోసం యుద్ధాలు చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతీ దేశం భయానకమైన ఆయుధాలను సొంతం చేసుకుంది. పదుల సంఖ్యలో అణ్వాయుధాలు…
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాంలు, కాలుష్యం.. కానీ ఇప్పుడు నగరం తీరు మారింది. నగరం అంతా పచ్చదనం పరుచుకుంటోంది. కాంక్రీట్ తో కట్టుకున్న ఫ్లై ఓవర్లు కింద పచ్చని మొక్కలు కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అసలు మనం సిటీలోనే వున్నామా.. ఇన్ని ఫ్లై ఓవర్లున్నా అంతగా కాలుష్యం రావడం లేదని అంతా అవాక్కవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేపడుతున్న వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో షేక్ పేటలో నిర్మాణమవుతున్న…
ఆకాశంలో శాటిలైట్స్ మనిషి కంటికి కనిపించవు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ శాటిలైట్స్ కారణంగానే ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలసుకోగలుతున్నాం. ఈ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇటీవలే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ శాటిలైట్స్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ స్టార్‌లింక్ శాటిలైట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఆకాశంలో అప్పుడప్పుడు డజనుకు పైగా ఉపగ్రహాలు…
ఎలన్ మస్క్ 300 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపదను కలిగియున్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అదే విధంగా మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నది. తక్కువ ధరకే శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్రవేశించింది.…
అంతరిక్షం ఎప్పుడూ చాలా ఆసక్తిగా ఉంటుంది. అంతరిక్షంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అ కేంద్రంలో కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతరిక్షంలో మందులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపైన తయారయ్యే మందులపై కొన్నిరకాల సూక్ష్మజీవుల ప్రభావం ఉంటుంది. కానీ, అంతరిక్షంలోని పీడనం, వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో స్పేస్‌లో మందులను తయారు చేస్తే…
ఇటీవలే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. బ్లూఆరిజిన్ సంస్థ తయారు చేసిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్‌తో పాటుగా ఆయన సోదరుడు మార్క్, మరో ఇద్దరు కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు భూమి మీద నుంచి బయలుదేరి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడానికి పట్టిన సమయం 11 నిమిషాలు. అయితే, ఇప్పుడు కొందరు ఓ వితండ వాదానికి తెరతీశారు. అమెజాన్ బాస్ జెఫ్ అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత ఆయన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి ఆయన…
అమెజాన్ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి…
వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌన ఇటీవలే విజయవంతంగా రోదసిలోకి వెళ్లివచ్చింది. కమర్షియల్‌గా రోదసి యాత్రను ప్రారంభించేందుకు వర్జిన్ గెలక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల వరకు రోదసిలో ప్రయాణం చేసి అక్కడ భారరహిత స్థితిని పొందిన అనుభూతిని పొందిన తరువాత తిరిగి భూమిమీదకు వస్తుంది. వర్జిన్ గెలక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతం కావడంతో, ఇప్పుడు అనేక మంది ఈ యాత్రను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలోని కేరళకు చెందిన పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర వర్జిన్…