అమెజాన్ చీఫ్ అంతరిక్ష యాత్ర విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి భూమికి చేరుకుంది.. అయితే, అంతరిక్ష యాత్రకు ముందు 45 నిమిషాల ముందే ఆ నలుగురు స్పేస్ షిప్‌లో కూర్చున్నారు.. స్పేస్ షిప్‌లో ప్రయాణం, దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి శిక్షణ కార్యక్రమం కూడా ఉంది. కాగా, రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఈ యాత్రను చేపట్టింది. జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణాన్ని సాగించారు..
బ్లూ ఆరిజిన్‌కి చెందిన న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగంతో రాకెట్ దూసుకెళ్లింది… నౌక బయలుదేరిన 2 నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోను కూగా.. అనంతరం సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారని తెలిపారు.. స్పేస్ షిప్ ప్రయాణం ప్రారంభమైన 6 నిమిషాలకు క్యాప్స్యూల్ నుంచి విడిపోయిన బూస్టర్ రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి పునర్ ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ ప్యాడ్‌కు చేరుకుంది. అయితే, క్యాప్స్యూల్ మాత్రం సముద్రమట్టానికి 100కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్ రేఖ వరకూ ప్రయాణించింది. ఆ సమయంలో వ్యోమగాములు కొద్దిసేపు భారరరహిత స్థితిని పొందారు. అనంతరం వ్యోమనౌక పారాచూట్ల సహాయంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో గంటకు 16కిలోమీటర్ల స్థాయికి వేగాన్ని తగ్గించుకుంటూ కిందకు దిగింది. దాదాపు 15నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విజయసంకేతం చూపుతూ క్యాప్స్యూల్ నుంచి బయటకు వచ్చారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్‌డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!