లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్‌ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది.
Sunita Williums : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్‌లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగుర వేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో నేడు స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు.
యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు సంబంధించిన కొన్ని ఫోటోలను నాసా విడుదల చేసింది. ఇందులో వర్షం కురిసే ముందు, తర్వాత ఆ ప్రాంతం చూపబడింది.
FDI in Space : ప్రపంచ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష ద్వారాలను తెరిచింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అంతరిక్షం, ఉపగ్రహం వంటి రంగాలకు విదేశీ పెట్టుబడుల నిబంధనలను సడలించాలని నిర్ణయించారు.
అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్నికి తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.