‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్. పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింది. వీరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్ ను వరల్డ్ మ్యూజిక్ డయాస్ పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ మ్యూజిక్…
గత కొన్ని రోజులుగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నూరు శాతం వాస్తవం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ప్రకటించారు.”1964లో డా. రామానాయుడుచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు…