ఈ సంవత్సరం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ ఎఫ్.ఎం. ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పీబీ గారి జ్ఞాపకార్థం ‘బాల గాన గాంధర్వులు’ పేరుతో పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు బాలుగారి సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య…
నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చాలా మంది ప్రముఖులు ఆయన్ను స్మరించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ‘మిస్ యూ మామా’ అంటూ చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. 1996 దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్…
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు చిత్ర సీమ గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుంది.…