‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమం ద్వారా బాలుకు సంగీత నివాళి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ ఎఫ్.ఎం. ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పీబీ గారి జ్ఞాపకార్థం ‘బాల గాన గాంధర్వులు’ పేరుతో పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు బాలుగారి సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. మ్యాజిక్ 106.4 ఎఫ్‌ఎమ్ ఆదర్వ్యంలో ఈ సంగీత నివాళి నిర్వహించబడింది. ఈ పోటీ ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారి వీడియోలను వాట్సాప్ ద్వారా మరియు మ్యాజిక్ ఎఫ్.ఎం డిజిటల్ పేజీలకు పంపించారు.
Read Also : “తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్, కోటి, ఆర్‌పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, కెఎమ్ రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు ‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమాన్ని అభినందించి ప్రోత్సహించారు. అంతే కాదు ఈ కాంటెస్ట్ కు సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి టాప్ 5 సింగర్స్ ను ఎంపిక చేశారు. టాప్ 5 ఫైనలిస్టుల్లో ప్రియాంక ప్రభాకరన్, సంజన, వెంకట శ్రీకీర్తి, ధ్రువ ప్రజ్వల్, తన్విలు నిలవగా విజేతలుగా ప్రియాంక ప్రభాకరన్, సంజన బహుమతులు కైవసం చేసుకున్నారు. జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం రోజున ‘బాల గాన గాంధర్వులు’ విజేతలు మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ స్టూడియోలో.. ఆర్జే రవళి, ఆర్జే కళ్యాణ్, ఆర్జె నాటీ నాని, ఆర్జె ప్రతీక చేతులు మీదగా ట్రోఫీలు అందుకున్నారు. అలాగే విజేతలకు 5000/- విలువైన గిఫ్ట్ ఓచర్లు కూడా అందజేశారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!