పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల…