సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్…
జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ…
ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది.…
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్డికాక్తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమార్తెకు కియారా అనే పేరు పెట్టినట్లు డికాక్ వెల్లడించాడు. ఈ మేరకు భార్య సాషా, కుమార్తె కియారాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Read Also: వాండరర్స్ టెస్ట్: భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం కాగా ఇటీవల టెస్టు క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు…
సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రెండో టెస్టులో ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో అదే దూకుడును ప్రదర్శించాలని చూసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే సౌతాఫ్రికా జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 266 పరుగులకే అలౌట్ అయింది. 243 పరుగుల…
జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది. Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో…
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు అదరకొట్టారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపుతూ 226 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ పేసర్ శార్ధుల్ ఠాకూర్ 7 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. అలాగే మహమ్మద్ షమీ రెండు బుమ్రా ఒక వికెట్లను పడగొట్టారు. కాగా శార్ధుల్ ఠాకూర్ కేవలం 17.5 ఓవర్లలోనే 7 వికెట్లను పడకొట్టి కేరీర్ లోనే ది బెస్ట్ ప్రదర్శనను…
భారత క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు. Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది.…