సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. భాతర బౌలర్లను ఎదుర్కొంటు సులవుగా బౌండరీల మీద బౌండరీలు బాదారు. సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ వన్డే లో విజయం సాధించాలంటే 297 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లు ఇద్దరూ సెంచరీ నమోదు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) పరుగులను 8 ఫోర్లు…
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెర లేచింది. పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్న తర్వాత తొలిసారిగా ఈ వన్డే సిరీస్‌లో ఓ సాధారణ ఆటగాడిగా కోహ్లీ ఆడబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే, ఈనెల 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి.…
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా…
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో……
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు…
సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. Read Also: బిగ్ బ్రేకింగ్: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి…
ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. కరోనా నేపథ్యంలో ఈ పొట్టి ఫార్మాట్‌ను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇక, స్వదేశంలోనూ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందే.. అయితే, ఐపీఎల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఈ ఐపీఎల్…
కేప్‌టౌన్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మళ్లీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేశారు. 24 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో పుజారా, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పుజారా 31 బంతుల్లో 9 పరుగులతో, కోహ్లీ 39 బంతుల్లో 14 పరుగులతో క్రీజులో…
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు. Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్‌లకు చోటు భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు…