ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది. ‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని…
ప్రముఖ దివంగత నటి సౌందర్య 18వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలచుకుంటున్నారు. సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అప్పుడే 17 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ… ఆమె ముగ్ద మనోహర రూపం, చెరగని చిరునవ్వు ఇంకా కళ్ళముందే కదలాడుతోంది అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తరువాత అంతటి అందం, అభినయం సౌందర్య సొంతం అనే ప్రశంసలను అందుకున్న సౌందర్యకు ఫ్యామిలి ఆడియన్స్ లోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే గ్లామర్……
(అక్టోబర్ 17న ‘పవిత్ర బంధం’కు 25 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసిన జంటల్లో వెంకటేశ్ – సౌందర్య జోడీనీ తప్పకుండా చేర్చాలి. వారిద్దరూ కలసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బంపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో ‘పవిత్రబంధం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కాంటాక్ట్ మ్యారేజ్’ అన్నది ప్రధానాంశం. 1996 అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘పవిత్ర బంధం’ ఘనవిజయం సాధించింది.…
అలనాటి మహానటి సావిత్రి గూర్చి ఈ తరానికి గొప్పగా పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.. అయితే ఇప్పటి తరానికి సౌందర్య గూర్చి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. అయితే ఆమె బయోపిక్ ను తెరకెక్కించాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికి…
కొన్ని కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి, విజయాలనూ సొంతం చేసుకుంటాయి. కానీ, ఎందుకనో రిపీట్ కావు. అదే విచిత్రంగా ఉంటుంది. చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలు సాధారణమే అనుకోవాలి. హీరో వెంకటేశ్ తో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అలాంటి చిత్రమైన పరిస్థితినే చూశారు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యులద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. అయితే వెంకటేశ్ సొంత సంస్థ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయనను డైరెక్ట్ చేయలేకపోయానని ఇ.వి.వి. సత్యనారాయణ అంటూ ఉండేవారు. వెంకటేశ్, ఇ.వి.వి.…