హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసిఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.