పూర్వ కాలానికి.. నేటి ఆధునిక కాలానికి చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.…