అమరావతి రైతులకు నటుడు సోనూసూద్ తన మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 600 రోజులకు పైగా నిరసన చేస్తున్న అమరావతి రైతులకు తాజాగా ఆంధ్రాలో పర్యటించిన సోనూసూద్ సపోర్ట్ చేశారు. మహిళలతో సహా అమరావతి నుండి కొంతమంది రైతులు సోనూసూద్ విజయవాడ సందర్శన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి గన్నవరం విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. గురువారం 632వ రోజుకు చేరుకున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విమానాశ్రయం దగ్గరే సోనూసూద్ ని కోరారు. గత…