ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెట్టాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా.. తోడుగా నిలిచాడు.
సోనూసూద్ చేసిన ఓపనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడున్నారు. డిసెంబర్13న సోనూసూద్ కదుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హ్యాండ్ రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని, రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించాడు సోనూ.