National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు.