పొత్తులపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం.…