గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే అని, ఆ శక్తులు ఉనికి శాశ్వతం కాదని అన్నారు. ఆ శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్టలేవని ప్రధాని తెలిపారు. సోమ్‌నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని,…