గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే అని, ఆ శక్తులు ఉనికి శాశ్వతం కాదని అన్నారు. ఆ శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్టలేవని ప్రధాని తెలిపారు. సోమ్‌నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని, ఉనికిని అంతం చేయడానికి చేయని ప్రయత్నం లేదని తెలిపారు. పతనం చేయడానికి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ తిరిగి లేచి నిలబడిందని, దీనిని సాధ్యం చేసిన సోమనాథ్ ట్రస్ట్ సభ్యులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోమనాథుని భక్తులకు మోడీ కృతజ్ఞతలు తలిపారు. సోమ్‌నాథ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీదేవి ఆలయం, పాత సోమ్‌నాథ్ దేవాలయ ప్రాంగణ పునఃర్నిర్మాణం ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు.
Read: ఐదు రోజుల్లోనే మొత్తం మారిపోయింది… ఇప్పుడు ఎక్కడ చూసినా…