ఒకవైపు కరోనా మహమ్మారి , మరోవైపు ఆర్థిక సవాళ్లు ..ఈనేపథ్యంలో పోర్చుగల్‌లోని సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయపరంపర కొనసాగిస్తోంది. కోవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయం సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 230 సీట్లున్న పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. మరికొన్ని సీట్లు వస్తే పూర్తి మెజారిటీ సాధ్యం అవుతుంది. ఈ…