సమగ్ర కుటుంబ(ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
Caste Census : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే.. ఈరోజు సమగ్ర కులగణన సర్వేపైన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు…
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.