సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అదే ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ సాయం! గతంలో ఎన్నో సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో కనిపించిన ఫిష్ వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కిడ్నీ దొరకక ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఒకవేళ కిడ్నీ దొరికినా, దాని ట్రాన్స్‌ప్లాంట్ కోసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
Also ReaD: Raviteja : రవితేజ లైఫ్ ఇస్తే.. వాళ్లు పట్టించుకోవట్లేదా..?
అయితే, ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ చేసి ఖర్చు ఎంత అవుతుందో కనుక్కున్నాడట. తర్వాత ఆ వ్యక్తి కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు ఒక మీడియా ఛానెల్‌కి చెప్పడంతో, మిగతా మీడియా ఛానెళ్లు ప్రభాస్ 50 లక్షల ఆర్థిక సాయం చేశాడంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ చేశాయి. అయితే, ఫోన్ చేసి డబ్బులు ఇస్తామన్న వ్యక్తి కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మరోవైపు ప్రభాస్ సాయం చేశాడంటూ ప్రచారం జరగడంతో ఫిష్ వెంకట్ కుటుంబం అప్రమత్తమైంది. తమకు ఎలాంటి సాయం అందలేదని, ప్రభాస్ టీమ్ నుంచి చెప్పుకుంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడని, అది ఎంతవరకు నిజమో తెలియదని వారు స్పష్టం చేశారు.