శోభన్ బాబు.. అందగాడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణలకు గట్టి పోటీగా నిలిచి కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆయన.. సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచి పోయారు. అయితే శోభన్ బాబు కి ఇండస్ట్రీలో ఇంత పేరు పరక్యాతలు ఉన్నప్పటికి తన వారసులను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కాని గత కొద్దిరోజులుగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన…
విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్‌బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్‌బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం, శోభన్‌బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ.సతీష్ కుమార్, విగ్రహ దాత జె.రామాంజనేయులు , రాశీ మువీస్ అధినేత ఎం.నరసింహరావు, సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల…
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.
Krishnamraju bonds in cinema are attachments: నటరత్నతో రెబల్ స్టార్ అనుబంధం! పౌరాణికాలలో యన్టీఆర్, సాంఘికాలలో ఏయన్నార్ అభినయం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ముఖ్యంగా యన్టీఆర్ ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే ఆయనకు ఎంతోఇష్టం. అలాంటి నటరత్న యన్టీఆర్ ను కృష్ణంరాజు తొలిసారి కలుసుకున్నదీ ఆయన కృష్ణుని గెటప్ లోఉండగానే! `శ్రీకృష్ణతులాభారం` చిత్రంలో యన్టీఆర్ శ్రీకృష్ణుని వేషంలో ఉండగా ఆయనను తొలిసారి కలుసుకున్నారు కృష్ణంరాజు. ఆ సమయంలో యన్టీఆర్ తనపై చూపిన ఆప్యాయతను ఎన్నటికీ…
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం పలు సంవత్సరాలు పాట్లు పడిన చరిత్ర శోభన్ బాబుది. దాదాపు పుష్కరకాలానికి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ విజయంతో స్టార్ అనిపించుకున్నారు శోభన్ బాబు. అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించారు. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత శోభన్ బాబు సైతం అదే తీరున విజృంభించారు. తరువాత “చెల్లెలికాపురం, అమ్మమాట, సంపూర్ణ రామాయణం” వంటి విలక్షణమైన చిత్రాలు, విజయాలూ శోభన్ ను పలకరించాయి. ఆ పై…
(మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి)సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఎవరినైనా చిత్రసీమ తల్లిలా ఆదరిస్తుందని ఎందరో చెబుతూ ఉంటారు. చిత్రసీమలోనే నటునిగా నిలదొక్కుకోవడానికి నటభూషణ శోభన్ బాబు దాదాపు పుష్కరకాలం శ్రమించారు. 1959లో యన్టీఆర్ ‘దైవబలం’లో ఓ చిన్న పాత్ర ద్వారా తెరపై తొలిసారి కనిపించిన శోభన్ బాబు, తారాపథం చేరుకోవడానికి దాదాపు 12 ఏళ్ళు కష్టపడ్డారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ సక్సెస్ తో శోభన్ బాబు కూడా స్టార్ హీరో అయిపోయారు. అంతకు ముందు ఆయన…