పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకున్నాయి. దాదాపుగా ఏడు నిమిషాలపాటు ఈ ఫైట్ జరిగింది. ముంగీస చేతిలో చావుదెబ్బలు తిన్న పాము అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ముంగీస మాత్రం…
కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో ఉన్న ప్రాణికి ఊపిరి అందివ్వడమే. అందులో స్పెషల్ ఏముంది అనుకుంటే పొరపాటే. Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : వారికి…
కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్…
మామూలుగా మనం పాము కనపడితే ఆమడ దూరం పరిగెడతాం. లేదంటే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం. కానీ, ఆ యువతి మాత్రం అలా చేయలేదు. రోడ్డుపక్కన భయంకరమైన పాము కనిపించగానే వెంటనే దాని తోక పట్టుకుంది. అనంతరం దాని తలను పట్టుకుంది. ఆమె చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు పాము శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ, ఆమె దాన్ని వదలలేదు. పైగా పామును బెల్టు మాదిరిగా నడుముకు చుట్టుకొని తనకేమి తెలియదన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది.…
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి…
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. మద్యం వలన ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని అరియలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో బాటిల్ కొనుగోలు చేశాడు. సగం తాగిన తరువాత చూస్తే అందులో పాము పిల్ల కనిపించింది. బాటిల్ లో పాము కనిపించేసరికి మద్యం మత్తు దిగిపోయింది. వెంటనే ఎక్కడైతే కొనుగోలు…
కరోనా సమయంలో ఫేస్ మాస్క్ లు తప్పనిసరి అయ్యింది. మాములుగా మెడికేటెడ్ మాస్క్ లతో పాటుగా గుడ్డతో తయారు చేసిన వివిధ రకాల మాస్కులు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల డిజైన్స్ తో కూడిన మాస్క్ లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇంగ్లాండ్ లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ కు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు వెరైటీ మాస్క్ ధరించి బస్సు లో ప్రయాణం చేస్తున్నాడు. పాము చర్మంతో తయారు చేసిన మాస్క్ లా ఉండటంతో వెరైటీ గా ఉందని అనుకున్నారు. కాసేపటి తరువాత…