జనరల్ గా పాములు వర్షం పడిన వెంటనే పుట్టలోంచి బయటికి వస్తాయి. పుట్టలోకి వర్షపు నీరు చేరడం.. అందులో వేడిగా ఉన్న కారణంగా బయటికి వస్తాయి. వర్షం పడగానే చల్లదనానికి పాములు బయట సంచరిస్తుంటాయి. ఇలా బయటికి వచ్చిన పాములు మనిషి కంట పడితే.. కొందరు చంపేస్తారు.. మరి కొందరు మాత్రం స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తుంటారు. స్నేక్ క్యాచ్ లను పామును చాలా ఈజీగా పట్టేస్తుంటారు. కానీ తాజాగా ఓ స్నేక్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Relationship : రూమ్ తీసుకుని కామ్‌గా ఉందాం అనుకున్నారు.. కానీ ఇంతలోనే
భారీ పాములను పట్టే స్నేక్ క్యాచర్ లకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు స్టిక్ సాయంతో పడితే.. మరికొందరు ఒట్టిచేతులతోనే పట్టేస్తారు.. థాయిలాండ్ కు చెందిన ఓ స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాలను కూడా సునాయాసంగా పడతాడు. కింగ్ కోబ్రాను మభ్యపెట్టి మరీ పట్టేశాడు. పాము ముందు ఒకరిని నిలబెట్టి దాని నజర్ మళ్లీస్తాడు. వెనకాల నుంచి నెమ్మదిగా వచ్చే అతడెు ఒక్కసారిగా పడగవిప్పిన పాము తలను పట్టేస్తాడు. ఆపై దాన్ని సంచిలో బంధిస్తాడు.
Also Read : Jharkhand: శ్రీ రామనవమి వేడుకలపై జార్ఖండ్ ప్రభుత్వం ఆంక్షలు.. హజారీబాగ్‌లో ఉద్రిక్తత
థాయిలాండ్ లో వర్షాకాల సమయంలో ఓ ఫామ్ ఆయిల్ తోటలో దాదాపు 30 అడుగుల కింగ్ కోబ్రా యజమానికి కనిపించింది. దీంతో యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వగా.. వెంటనే అతడు తోటకు వస్తాడు.. ముందుగా కింగ్ కోబ్రా తోకను ఒకరు పట్టుకుని ఉండగా.. ముందు నుంచే దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అది అసలు సాధ్యం కాదు.. దీంతో కాసేపటి తరువాత ఒకతను పాము ముందుండి దాని దృష్టిని తనవైపు తిప్పుకుంటాడు. వెనకాల నుంచి స్నేక్ క్యాచర్ వచ్చి దాని తలను పట్టేస్తాడు..
Also Read : Bharat Gaurav Train : తొలి భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి
కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ తన మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఆపై దానిని సంచిలో బంధించి అడవిలో వదిలేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను Nick Wildlife అనే యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తుంది. నీ ధైర్యానికి హ్యాట్సాప్ బాసూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.