బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని వయనాడ్(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టుబడింది. విదేశీ ప్రయాణీకుల వద్ద 10 కోట్ల విలువ చేసే 21.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుండి ముంబాయి వచ్చిన 16 మంది విదేశీ ప్రయాణీకులు వద్ద ఈ బంగారం దొరికింది. అయితే.. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగగానే కస్టమ్స్ అధికారులతో గొడవకు…