వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం…