Smoking : సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. అది తెలిసి కూడా చాలా మంది స్మోకింగ్ మానుకోలేకపోతున్నారు. నిరంతరం సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది.
జపాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి గడిచిన 14 సంవత్సరాలలో ఏకంగా 4, 512 సార్లు స్మోకింగ్ బ్రేక్ తీసుకున్నాడట. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానా విధించారు.
ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్‌లో ధూమపానం చేసి ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అమెరికా పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు ఆదివారం తెలిపారు.
Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్…
మనిషిని అనుకరించడంలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి. మనుషులు ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుసరించి చింపాంజీలు పనులు చేస్తాయి. ఒక్కోసారి మనుషులను మించి చింపాంజీలు ప్రవర్తిస్తుంటాయి. దుస్తులు ఉతకడం కావొచ్చు బొమ్మలు వేయడం కావొచ్చు… ఎవైనా సరే మనుషులను అనుకరించి చేస్తుంటాయి. అయితే, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ జూను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే, ఈ జూలో చింపాంజీలకు అక్కడి అధికారులు వెరైటీగా ట్రైనింగ్ ఇచ్చారు. మనుషులు ఎలాగైతే సిగరేట్ తాగుతారో ఆ విధంగా…
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాలు తెలిసినప్పటికీ పొగతాగడం మానడం లేదు. పొగ తాగడం వలన ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. శ్వాససంబంధమైన జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక, పొగతాగడం వలన గుండెసంబంధమైన జబ్బులు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదు. గుండెజబ్బులతో పాటు, క్యాన్సర్ వంటివి కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంచితే కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు…
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. ధూమపానం చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా పాడైపోతుంది. ఫ్యాషన్ మోజులో పడి యువత సిగరేట్ కాలుస్తూ ఆరోగ్యాన్ని, విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2008 వ సంవత్సరం తరువాత పుట్టిన వారు స్మోకింగ్ చేయకుండా చట్టాన్ని చేసింది. Read: బాలినో భళా… మూడేళ్ల కాలంలో… ఇప్పుడు సిగరేట్‌లో ఉన్న నికోటిన్ శాతాన్ని కూడా క్రమంగా తగ్గించే చర్యలు…
కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బీడీ కాల్చారు. సోమవారం నాడు కమలాపురంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిపోతుండగా.. ఓ ఇంట్లో బీడీ తయారీ ప్రక్రియను చూసి మంత్రముగ్ధుడయ్యారు. దీంతో కార్మికుడు తయారుచేసిన బీడీ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. బీడీని అంటించుకుని స్టైలుగా పొగ వదలడంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప…
మందు, సిగరేట్ కు అలవాటు పడిన వ్యక్తులు దాని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఒకసారి అలవాటు పడ్డారంటే క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ వ్యసనాలు తప్పుడు మార్గంలో నడిపించేలా చేస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు మావల్ల కాదులే అని చెప్పి మళ్లీ ఆ వ్యసనాలకు బానిసలవుతుంటారు. అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయితే తప్పకుండా ఈ…