మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి.