Sleeping in Office: ఆఫీసులో పనిచేయకుండా నిద్రపోతే ఉద్యోగం ఊడటం ఖాయం. కంపెనీ ఏదైనా అది ఫాలో అయ్యే పాలసీ మాత్రం ఇదే. కానీ.. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అందరి కన్నా భిన్నంగా ఆలోచించింది. నిద్రపోయేందుకు ప్రత్యేకంగా ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయించింది. పని వేళల్లో అలసటగా అనిపించినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేందుకు అనుమతిస్తోంది. ఈ మేరకు ‘రైట్ టు న్యాప్’ అనే పాలసీని తెర మీదికి తీసుకొచ్చింది.
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..…