ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్‌బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్‌ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు.…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం… అయితే, ఇదే సమయంలో.. గతంలో ఉన్న సడలింపుల సమయాన్ని పెంచింది.. గతంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఇక, ఇళ్లకు చేరుకోవడానికి మరో గంటల సమయం ఇచ్చింది.. దీంతో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు…