KTR: కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా కాపాడుతున్నదని ఆయన మండిపడ్డారు. సాక్ష్యాదారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన మౌనం వహిస్తున్నదన్నారు కేటీఆర్. గతంలో కాలేశ్వరం ప్రమాదంపైన అఘామేగాలపై స్పందించిన కేంద్రం… మెన్న సుంకిశాల ప్రమాదం పైన…
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. 'తెలంగాణలో సొరంగం పైకప్పు కూలడం నన్ను ఎంతో బాధించింది.. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నవారిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తుంది' అని రాహుల్ గాంధీ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్‌లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం..