వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై…
2021 నవంబర్ 21 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఎస్‌కెఎం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది. ఈ నెల 7న సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం అవుతుందని, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఏడాదిగా రైతు ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్న ఢిల్లీ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న…