ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
Bihar: బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులిద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్ విషయంలో క్లాస్ రూమ్‌లో ఒకరితో ఒకరు గొడవపడ్డారని, ఆ తర్వాత కాలేజీ నుంచి రోడ్డుపై ఎక్కి కొట్టుకున్నారని చెబుతున్నారు.