సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు.
సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సీనియర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.