ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ8 చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. 2019-2024 సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీని సిట్ కోరింది.
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడు లో అరాచకం చేశారు.. టీడీపీ, అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు.