ఒకానొక సమయంలో తెలుగు చిత్రసీమలో బాలల చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఎంత పేరు మోసిన తారలు నటించినా, ‘చైల్డ్ సెంటిమెంట్’ అంటూ ఉంటే, కథ రక్తి కట్టిస్తుందని సినిమాజనం నమ్మకం. అదే తీరున కొందరు టాప్ స్టార్స్ చిత్రాల్లోనూ చైల్డ్ సెంటిమెంట్ బాగా పండి, ఘనవిజయాలు లభించాయి. కొన్ని సార్లు అలాంటి సినిమాలతోనే కొందరికి మరింత పేరు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 1970ల ఆరంభంలో రూపొందిన ‘సిసింద్రీ చిట్టిబాబు’ ఆ కోవకు చెందినదే. శోభన్ బాబు…