Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి లేఖ రాశారు. ప్రొఫెసర్‌ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.