ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటనను సోమవారం రోజు అడ్డుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఆయనను జిల్లా సరిహద్దులో అడ్డుకున్నారు.. అంతేకాదు, ఓ టీఆర్ఎస్ కార్యకర్త పాల్‌పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, తాను మళ్లీ సిరిసిల్ల వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు కేఏ పాల్.. నాపై దాడి చేసిన అనిల్‌తో నాది తెలంగాణ కాదని చెప్పిస్తున్నారు.. బాబు అనిల్ మత్తు తగ్గిన తరువాత ఇది…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక, సీఎం పర్యటనను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్ననే పర్యటించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్నా సీఎం…