దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలియగానే లక్షలాది మంది అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఆకస్మిక మరణం పలు అనుమానాలకు దారి తీసింది.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై తలెత్తిన అనుమానాలే నిజమవుతున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి ముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా జుబీన్ గార్గ్ మంచి ఈతగాడు కూడా. అలాంటిది ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.