(నేపథ్య గాయకుడు పిఠాపురం జయంతి సందర్భంగా)తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమ నేపథ్య గానంతో దానికి అదనపు మెరుగులు అద్దినవారు ఎందరో ఉన్నారు. అందులో పిఠాపురం నాగేశ్వరరావు ఒకరు. తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది – పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. కేవలం హీరోహీరోయిన్లకో, ఐటమ్ గీతాలకో, హీరో ఇండ్రక్షన్ సాంగ్స్ కో మ్యూజిక్ ఆల్బమ్ పరిమితమైన పోతున్న ఈ రోజులకు భిన్నంగా సినీ స్వర్ణయుగం సాగింది. అందులో హాస్య పాత్రధారులకూ…