విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాగే.. సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్… సింగరేణి కార్మికులు సమ్మె చేసినా ప్రైవేట్ పరం చేసే కుట్ర మోడీ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఈ పరిణామాలన్నీ తెలంగాణపై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాదన్నారు.. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా… నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. విశాఖ ఉక్కు…
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్… సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారంగా తెలిపిన ఆయన.. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్న ఆయన.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుంది.. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని…