రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్లను కేటాయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిని ఆమోదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశామని ఎన్.శ్రీధర్ వెల్లడించారు. దీంతో సింగరేణి కార్మికుల 50 ఏళ్ల…
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఎస్‌ఆర్‌పీ-3,3ఎ ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ…