తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, పాజిటివ్ క్రికెట్ ఆడతాం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ తెలిపారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని చెప్పారు. గతంలో విజయం సాధించినా, ఓడినా సరే దానిని పక్కన పెట్టేయాలన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సైమన్ చెప్పుకొచ్చారు. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30కు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్…