ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని బౌలింగ్ పై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 కీలక వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత.. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ షమీపై పొగడ్తల వర్షం కురిపించాడు.