జ్యోతిలక్ష్మిలాగా గొప్ప నర్తకి కాదు, జయమాలినిలాగా అందం, చందం ఉన్నదీ లేదు. అయినా సిల్క్ స్మిత ప్రవేశంతో ఆ ఇద్దరికీ కొన్ని అవకాశాలు తగ్గాయి అనడం అతిశయోక్తి కాదు. మరి సిల్క్ స్మితలో ఏముంది? మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే ఆకర్షణ ఉంది. అందుకే సిల్క్ ను కొందరు అయస్కాంతం అన్నారు.