(డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి)‘సిల్క్’… ఈ పేరు వినగానే ఆ రోజుల్లో కుర్రాళ్ళ నరాలు జివ్వుమనేవి. ఇక సిల్క్ స్మితను తెరపై చూడగానే వారి మనసులు విహంగాలై తేలిపోయేవి. సిల్క్ స్మితను శృంగార రసాధిదేవతగా కొలిచిన వారెందరో ఉన్నారు. సిల్క్ స్మిత నర్తనంలో పట్టు కనిపించక పోయినా, ఆమె సౌష్టవం గుట్టుగా జనం మదిని కొల్లగొట్టేది. అది తెలిసిన సినీజనం సిల్క్ సింగారానికి ఎర్రతివాచీ పరిచారు. సిల్క్ స్మిత ఆటకు జనం జేజేలు కొట్టారు. సిల్క్…