Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న వాహనం గురువారం రాత్రి తీస్తా నదిలో పడిపోయింది. దాదాపుగా 1000 అడుగుల ఎత్తు నుంచి వాహనం పడిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 9 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. వాహనం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా వాహనం మలుపు తిరిగే సమయంలో ప్రమాదం జరిగింది.
Sikkim : సిక్కింలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రాణిపూల్‌లో ఓ కార్యక్రమంలో పాల ట్యాంకర్ మూడు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు సమాచారం.