ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టింది. అంతేకాకుండా ఆటగాళ్ల ముఖాల్లో ఇప్పటివరకు ఓటమి బాధ పోవడంలేదు. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి బాధను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌లో భారత ఆటగాళ్లందరూ ఉన్నారు.
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
Sara Ali Khan Confirms Shubman Gill Is Dating With Sara Tendulkar: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆట కంటే.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్…
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ అయ్యారు. గిల్ 93 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ వరల్డ్ కప్‌లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్‌మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా…
IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 14వ తేదీ శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. రేపు జరగబోయే ఇండియా-పాకిస్తాన్ కు మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. శుభ్ మాన్ గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. గిల్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు.