Yashasvi Jaiswal, Suryakumar Yadav nominees for ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడానికి సిద్ధమైంది. వన్డే, టీ20, ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఐసీసీ ఇవ్వనుంది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కోసం ఐసీసీ నలుగురు ప్లేయర్లను నామినేట్ చేయగా.. అందులో ముగ్గురు భారత్ నుంచి ఉండటం విశేషం. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ రేసులో ఉన్నారు. మరి ఎవరికి అవార్డు దక్కుతుందో చూడాలి.
2023లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 27 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 1,377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా కూడా నిలిచాడు. 2004 నుంచి ఈ అవార్డును ఐసీసీ ప్రదానం చేస్తుండగా.. అత్యధికంగా కోహ్లీ నాలుగు సార్లు (2010, 2012, 2017, 2018) గెలుచుకున్నాడు. ఈ ఏడాదిలో మొహ్మద్ షమీ 19 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ 2023లో 7 మ్యాచ్‌లోనే ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ 29 మ్యాచ్‌ల్లో 1,584 పరుగులు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. డారిల్ మిచెల్ 26 మ్యాచ్‌ల్లో 1,204 పరుగులు, 9 వికెట్లు తీశాడు.
భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డ్స్ 2023కి నామినేట్ అయ్యారు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికైన నలుగురిలో సూర్యకుమార్ ఉండగా.. జైస్వాల్ ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023కి నామినేట్ అయ్యాడు. అయితే మహిళల అవార్డులకు మాత్రం ఒక్క భారత ప్లేయర్ కూడా ఎంపిక కాలేదు.
Also Read: Virat Kohli: డీన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ!
ఐసీసీ 2023 అవార్డులకు నామినేట్ ప్లేయర్లు:
ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: విరాట్ కోహ్లీ (భారత్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), శుభ్‌మన్ గిల్ (భారత్), మహ్మద్ షమీ (భారత్).
ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: చమరి (శ్రీలంక), ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా), అమేలియా కెర్ (న్యూజిలాండ్), నాట్ స్కివర్ బ్రంట్ (ఇంగ్లాండ్).
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), అల్పేష్ రంజనీ (ఉగాండా), సికందర్ రజా (జింబాబ్వే), సూర్యకుమార్ యాదవ్ (భారత్).
ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: చమరి (శ్రీలంక), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా).
ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: జెరాల్డ్ కొయెట్జీ (దక్షిణాఫ్రికా), యశస్వి జైస్వాల్ (భారత్), మదుశంక (శ్రీలంక), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్).
ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మరుఫా అక్టర్ (బంగ్లాదేశ్), లారెన్ బెల్ (ఇంగ్లాండ్), డార్సీ కార్టర్ (స్కాట్లాండ్), లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా).