న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్, యువకులతో టీమ్ సమతుల్యంగా ఉండేలా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును ఎంపిక చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈరోజటికి వాయిదా పడింది. కెప్టెన్సీ బాధ్యతలు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించే అవకాశం ఉండటం ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు కీలకంగా ఉండనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు ఎంపిక కానున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పంత్ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ప్లస్‌గా మారనుంది. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. బ్యాట్‌తో పాటు బంతితోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం వీరి సొంతం.
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. అతని చైనామన్ స్పిన్ కీలకంగా మారే అవకాశం ఉంది. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ జట్టు ముందుకు నడిపించనున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి పేసర్లు జట్టులో చోటు దక్కించుకోనున్నారు. టీ20 ప్రపంచకప్ 2026ని దృష్టిలో ఉంచుకుని పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించనున్నట్లు తెలిసింది. కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు ఎలా ప్రదర్శిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Balakrishna-Boyapati: ‘అఖండ’ కాంబో.. బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్?
భారత జట్టు (అంచనా):
1. శుభమాన్ గిల్ (కెప్టెన్)
2. రోహిత్ శర్మ
3. విరాట్ కోహ్లీ
4. రుతురాజ్ గైక్వాడ్
5. కేఎల్ రాహుల్
6. రిషబ్ పంత్
7. తిలక్ వర్మ
8. ప్రసిద్ధ్ కృష్ణ
9. అక్షర్ పటేల్
10. యశస్వి జైస్వాల్
11. వాషింగ్టన్ సుందర్
12. కుల్దీప్ యాదవ్
13. మహ్మద్ సిరాజ్
14. హర్షిత్ రాణా
15. అర్ష్‌దీప్ సింగ్